ఆర్థిక ఎదుగుదలలో నారీ శక్తికి అన్నీ అడ్డంకులే

by Jakkula Samataha |
ఆర్థిక ఎదుగుదలలో నారీ శక్తికి అన్నీ అడ్డంకులే
X

దిశ, ఫీచర్స్ : నారీ శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళా సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు. గొప్ప గొప్పవారు అన్నారు ఒక దేశం పురోగతికి ఉత్తమమైన కొలమానం స్త్రీ అని. శతాబ్దాలుగా మహిళలు ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా వారి అనంతమైన సహనం, పట్టుదల వారు ఎదగడానికి ఎంతగానో సహాయపడ్డాయి.ప్రస్తుతం మహిళలు ఏ రంగంలోనైనా దూసుకెళ్తున్నారు.గడిచిన కాలం తో పోలిస్తే మహిళాభివృద్ధి అనేది పెరుగుతోంది.మహిళా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ప్రతిభ, అంకితభావం, ఉత్సాహంతో పట్టుదలతో పని చేస్తున్నారు. వారు భారతదేశ ఆర్థిక వృద్ధికి, శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నారు. ఇక ప్రస్తుతం, భారతదేశంలో పని చేసే వయస్సు గల మహిళలు 432 మిలియన్లు ఉన్నారు, వీరిలో 343 మిలియన్లు అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు.

కాగా, ఓ నివేదిక ప్రకారం కేవలం మహిళలకు సమాన అవకాశాలను అందించడం ద్వారా, భారతదేశం 2025 నాటికి తన GDPకి US$770 బిలియన్‌లేనని అంచనా వేసింది. అయినప్పటికీ, GDPకి ప్రస్తుతం మహిళల సహకారం 18%గా ఉందని వారు పేర్కొన్నారు.

అయితే దీనికి కారణం మహిళలు ఇప్పటికీ లింగ అసమానతలు ఎదుర్కోవడం. ముఖ్యంగా మహిళలు వృత్తిపరమైన అవకాశాలలో అడ్డంకులు ఎదుర్కోవడమే దీనికి అసలైన కారణం అంటున్నారు నిపుణులు. వీరికి ఆర్థిక సహకారం లేకపోవడం, అవకాశాల్లో అసమానతలు చూపించడం వలన జీడీపీలో మహిళల సహకారం తగ్గింది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఫలితంగా, భారతదేశం యొక్క లింగ అంతరం 4.3% పెరిగింది, దీని కారణంగా భారతీయ మహిళలకు ఆర్థిక అవకాశాలు తగ్గుముఖం పట్టాయి, ఇది అధికారిక వర్క్‌ఫోర్స్‌లో వారి భాగస్వామ్యంలో క్షీణతకు దారితీసింది. అయితే ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే, శ్రామికశక్తిలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 30% వృద్ధితో చెప్పుకోదగిన మార్పు వస్తుందని నివేదిక పేర్కొంది.

ఆర్థిక సహకారంలో మహిళలకు అడ్డంకులు

ఆర్థిక సహకారం, కార్మిక భాగస్వామ్యంలో లింగ అసమానత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. 2023లో, ఉపాధి కల్పించే జనాభాలో మహిళలు 53% ఉన్నారు, అయితే భారతీయ శ్రామికశక్తిలో వారు 25% కంటే తక్కువ ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. NFHS నివేదిక GDPకి మహిళల సహకారం కేవలం 18% మాత్రమేనని, శ్రామికశక్తిలో లింగ అసమానతను వెల్లడి చేసింది.

లింగ వేతన వ్యత్యాసాల గణాంకాల ప్రకారం, మహిళలు, సగటున, వివిధ రంగాలలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు, ఇది ఆర్థిక అసమానతలకు కారణం అవుతుంది.అలాగే వర్క్ చేసే చోట లైంగిక వేధింపులు. మగవారితో పోలిస్తే తక్కువ జీతం ఇవ్వడం,ఇంట్లో, కార్యాలయంలో వారు ఎదుర్కొనే వివక్ష, మహిళల ఆర్థిక ఎదుగుదలలో సమస్యలు ఇలా చాలా విషయాల్లో మహిళల ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదే విధంగా మహిళలు ప్రపంచ కార్మిక ఆదాయంలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే సంపాదిస్తున్నారని , ప్రపంచవ్యాప్తంగా 15% కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాగే 65శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 70శాతం మంది పురుషులు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అంటే పురుషులతో పొలిస్తే మహిళలు 5 శాతం తక్కువ. ఇక ఇంటర్నెట్, బ్యాంకింగ్ యాక్సెస్ చేయడంలోనూ వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నివేదిక ప్రకారం పరిశ్రమల్లో పనిచేసే 88% మంది మహిళలు అనధికారిక రంగంలో పనిచేస్తున్నారు. 7% మంది మహిళలు కూడా అనధికారిక శ్రామికశక్తికి చెందినవారు. వీటన్నింటి వలన మహిళలు ఆర్థిక సహకారం జీడీపీలో తగ్గుదలకు కారణం అయ్యింది.

మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించే మార్గం కేవలం మహిళా ఉపాధి అవకాశాలను పెంచడమే కాదు, మహిళలు ఎదుర్కొంటున్న డబుల్ షిఫ్ట్ భారాన్ని తగ్గించడం కూడా అవసరం అంటున్నారు నిపుణులు. ఇందులో విధాన రూపకల్పనలోని అన్ని రంగాల్లో మహిళలు చేయలేని పనులను గుర్తించడం షిఫ్ట్ భారాన్ని తగ్గించడం, వారికి మౌళిక సదుపాయాలు అందించడం,సమాన జీతభత్యాల, అధికారిక పనుల్లో మహిళలను తీసుకొని వారికి ఆర్థిక , సామాజిక సంక్షేమాన్ని పెంచడం ద్వారా మహిళల్లో ఆర్థిక సాధికారతను పెంచవచ్చు.

Advertisement

Next Story

Most Viewed