నిద్రలేమితో బాధపడుతున్నారా?.. మీకు సహాయపడే నేచురల్ హెర్బల్ సప్లిమెంట్స్ ఇవే..

by Javid Pasha |
నిద్రలేమితో బాధపడుతున్నారా?.. మీకు సహాయపడే నేచురల్ హెర్బల్ సప్లిమెంట్స్ ఇవే..
X

దిశ, ఫీచర్స్ : నిద్ర ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎవరికైతే కంటినిండా కునుకు పడుతుందో వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువ. ప్రతిరోజూ కనీసం ఐదు గంటలపాటు క్వాలిటీ స్లీప్ లేకపోతే గనుక తలనొప్పి, మైగ్రేన్, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తే చాన్సెస్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితులను నివారించడానికి కొన్ని సప్లిమెంట్స్, నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ అండ్ సప్లిమెంట్స్ దోహదపడతాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

మెలటోనిన్

శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ మెలటోనిన్. ఇది శరీరాన్ని ఎప్పుడు నిద్రించాలో, ఎప్పుడు మేల్కోవాలో ప్రేరేపిస్తుంది. అంటే స్లీప్ సర్కిల్‌ను నిర్వహిస్తుంది. కొందరు ఈ లోపం కారణంగానూ నిద్రలేమిని ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి మెలటోనిన్ సప్లిమెంట్లు జెట్ లాగ్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని పరిశోధకులు నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. సమస్యను బట్టి మెలటోనిన్ కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

లావెండర్ ప్లాంట్ అండ్ ఆయిల్

లావెండర్ మొక్క గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇది పుదీనా మొక్కజాతికి చెందినది. మీ నిద్రవేళకు ముందు ఈ ఊదా పువ్వును స్నిఫ్ చేయడం కారణంగా దాని సువాసన హార్ట్‌రేట్, అధిక రక్తపోటు, బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. ఇది నిద్రావస్థకు వేదికగా ఉంటుంది. లావెండర్-ఇన్ఫ్యూజ్డ్ గదిలో స్నూజ్ చేసే వ్యక్తులు, అలా చేయని వారితో పోల్చితే ప్రశాంతమైన గాఢ నిద్రను కలిగి ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి నిద్ర సమస్యను ఎదుర్కొనే వారు మీ బెడ్‌రూంలో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌ని వాడొచ్చని, పిల్లోకేస్‌కి కొన్ని చుక్కలను జోడించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వలేరియన్ మొక్క

వలేరియన్ అనేది ఐరోపా, ఆసియా ఖండాల్లో విరివిగా లభించే పుష్పించే మొక్క. వందల సంవత్సరాలుగా నిద్రను ప్రేరేపించే పువ్వులు గల మొక్కగా గుర్తింపు పొందింది. వేసవిలో ఇది విరగబూస్తుంది. దీని పువ్వుల వాసన చూస్తే ప్రశాంతంగా గాఢనిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే అలర్జీలు ఉన్నవారికి మాత్రం కొన్నిసార్లు తలనొప్పి, కడుపునొప్పిని కలిగించవచ్చు. ప్రతిరోజూ పడుకునేకంటే 2 గంటల ముందు 300-600 మిల్లీగ్రాములు ఎండిన వలేరియన్ పువ్వులను వేసి మరిగించి తాగడంవల్ల నిద్ర బాగా పడుతుందట.

చమోమిలే టీ

చమోమిలే అనేది ఆస్టెరేసి కుటుంబానికి చెందిన డైసీ వంటి మొక్కల జాతికి చెందినది. ఇది మానసిక వికాసాన్ని కలిగించడంలో, నిద్రను ప్రేరేపించడంలో ప్రసిద్ధి చెందింది. దీని పువ్వులను, విత్తనాలను పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా చమోమిలే టీ తాగితే నిద్ర బాగా పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కారణంగా ప్రశాంతతను ప్రేరేపిస్తుంది. ఇది విశ్రాంతికి, నిద్రపోవడానికి సహాయపడే కొన్ని మానవ మెదడు కణ గ్రాహకాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. పడుకునే ముందు ఒక కప్పు టీ సిప్ చేయడంవల్ల నిద్రలేమి సమస్య పారిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed