- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: రాత్రిపూట పెరుగు తింటున్నారా..? అయితే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి పెరుగు అంటే ఇష్టముంటుంది. కొందరైతే పెరుగు లేనిదే అన్నం తినరు. అన్నం చివరన పెరుగు లేకుండా.. భోజనం ముగించరు. ఇక పెళ్లిలు, ఫంక్షన్లకైతే పెరుగు ఉండాల్సిందే. అయితే చాలా మంది మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తింటారు. మధ్యాహ్నం తింటే మంచిదే కానీ రాత్రి తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రి పూట కర్డ్ తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
నిద్రకు భంగం:
రాత్రిపూట పెరుగు తినడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగులో ఉండే టైరమైన్ మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీని కారణంగా త్వరగా నిద్ర పట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు:
పెరుగు శరీరానికి ప్రొటీన్లను అందించే అద్భుతమైన ఆహారం. అయితే, ఇందులో కొవ్వు కూడా ఉంటుంది. రాత్రిపూట మీ శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేనప్పుడు దీన్ని తినడం వల్ల ఆ కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. ఇలా బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట పెరుగు తినకుండా ఉండాలి.
దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు:
మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళ పెరుగు అస్సలు తినకూడదు. అలాగే రాత్రిపూట పెరుగు తీసుకుంటే చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. దీనికి ప్రధాన కారణం పెరుగులో ఉండే చక్కెర సమ్మేళనం అయిన లాక్టోస్‌ను కొంతమంది శరీరాలు అంగీకరించకపోవడమే. దీన్నే ‘లాక్టోస్ ఇంటాలరెన్స్’ అంటారు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ, మన శరీరం లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది.
ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు:
రాత్రి పూట ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. అలాగే నైట్ టైమ్‌లో కర్డ్ తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరిగా పెరుగు తినాల్సి వస్తే.. పలుచగా మజ్జిగ లాగా చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులు:
కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కీళ్ల దృఢత్వం, నొప్పులు పెరుగుతాయని చెబుతారు. అయితే ఇప్పటికే ఆర్థరైటిస్ ఉన్నవారు పెరుగును తినడం తగ్గించాలి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.