- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూసైడ్ థాట్స్‌ను గుర్తిస్తున్న ఏఐ.. రాండమ్ ఆల్గరిథమ్స్‌తో సాధ్యమే!
దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో, ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఇది కీలకంగా మారిన విషయం తెలిసిందే. కానీ ఇది మనుషుల్లో డిప్రెషన్ అండ్ సూసైడ్ థాట్స్‌ను ముందుగానే పసిగట్టడంలోనూ హెల్ప్ అవుతుందని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్నప్పుడు కలిగే సూసైడ్ అండ్ సెల్ఫ్ హార్మ్ థాట్స్ రిస్కును ఏఐ ఎలా అంచనా వేస్తుందో వారి అబ్జర్వ్ చేశారు. ఇందులో భాగంగా న్యూ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను యూజ్ చేశారు.
మొత్తం 2,800 మంది కౌమారదశలో ఉన్నవారి మానసిక స్థితి, వారి ఆలోచనల విధానం, డిప్రెషన్ వంటి హెల్త్ ప్రొఫైల్స్ డేటాను రీసెర్చర్స్ ‘లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఆస్ట్రేలియన్ చిల్డ్రన్’ అనే ఆర్గనైజేషన్ నుంచి సేకరించారు. ఇందులో 15 నుంచి 16 ఏండ్లు, అలాగే 17 నుంచి 21 ఏండ్ల లోపు వయస్సుగల వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఆ తర్వాత వారి సంరక్షకులు, స్కూల్ టీచర్స్ పూర్తి చేసిన పిల్లల మానసిక ధోరణుల డేటాను కూడా ఎనలైజ్ చేశారు. తర్వాత న్యూ ఏఐ ర్యాండమ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను యూజ్ చేస్తూ సదరు స్టూడెంట్స్ థాట్స్ ఎలా ఉన్నయో విశ్లేషించారు. కాగా ఇందులో 10.5 శాతం మంది స్వీయ హాని చర్యలను కలిగి ఉన్నట్లు గమనించారు. 5.3 శాతం మంది గడిచిన 14 నెలల కాలంలో కనీసం ఒక్కసారైనా సూసైడ్ చేసుకునేందుకు ట్రైచేసినట్లు కనుగొన్నారు. దీనిని బట్టి ఏఐ న్యూ రాండమ్ ఆల్గారిథమ్ మోడల్స్ అనేవి ఆత్మహత్య ఆలోచనలను దాదాపు కచ్చితంగా అంచనావేస్తాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అయినప్పటికీ మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని భావిస్తున్నారు.