ట్రెండింగ్‌లో దోమల బర్గర్..

by Sujitha Rachapalli |
ట్రెండింగ్‌లో దోమల బర్గర్..
X

దిశ, ఫీచర్స్: పిజ్జా, బర్గర్ అంటే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాం. ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. టేస్ట్ బాగుంది కాబట్టి ఒకటి తినే దగ్గర రెండు లాగించేస్తాం. అయితే తాజాగా నెట్టింట 'దోమల బర్గర్ ' వైరల్ అవుతోంది. ఆఫ్రికా ప్రజలు వర్షాకాలంలో ఇష్టంగా చేసుకునే ఈ 'మస్కిటో బర్గర్ ' ఎందుకు అంతగా ట్రెండ్ అవుతుంది? ఇలా తయారు చేయాల్సిన అవసరం ఏంటి? దీని వల్ల ఏమైనా నష్టాలున్నాయా? లేక లాభాలున్నాయా? తెలుసుకుందాం.

ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా ప్రాంత ప్రజలు మస్కిటో బర్గర్ ను చాలా రుచికరమైన వంటకాల్లో ఒకటిగా భావిస్తారు. వర్షాకాలంలో ఈ లేక్ ఏరియాలో దోమలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి. వీటిని గ్రీజ్, పాన్, కుండల సహాయంతో భారీ మొత్తంలో కలెక్ట్ చేస్తారు. పాన్, కుండ లోపలి భాగాన్ని గ్రీజ్ తో పూయడం వల్ల దోమలు వాటికి అంటుకుని పోతాయి. దాదాపు ఐదు లక్షల కంటే ఎక్కువ దోమలను కలిపి బర్గర్ రూపంలో ప్రెస్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రై చేసి ఆరగించేస్తారు. కాగా ఈ బర్గర్ బీఫ్ తో చేసిన దాని కంటే ఏడు రెట్లు న్యూట్రిషన్ వాల్యూ కలిగి ఉందని చెప్తున్నారు నిపుణులు.

ఆ ఏరియాలో దోమలు ఎక్కువగా ఉండటం, తమ డైట్ లో పోషకాలు పెంచడం కోసం ఇలా చేస్తారు స్థానికులు. దోమలు ఎప్పటికప్పుడు రీ ప్రొడ్యూస్ అవుతునే ఉంటాయి. కాబట్టి ఇది సస్టైనబుల్ ఫుడ్ సోర్స్ గా ఉంది. ప్రస్తుతం ఈ మస్కిటో బర్గర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫారినర్స్ కూడా ట్రై చేస్తున్నారు. అయితే కొంత మంది దీనివల్ల మలేరియా, డెంగ్యూ ఫీవర్ రావొచ్చని అంటుండగా.. దోమలను ఫ్రై చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed