ఎత్తైన ప్రదేశాలంటే భయపడిపోతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే బయటపడొచ్చు..

by Sujitha Rachapalli |
ఎత్తైన ప్రదేశాలంటే భయపడిపోతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే బయటపడొచ్చు..
X

దిశ, ఫీచర్స్: చాలా మంది భవనాలు, కొండలు ఎక్కాలంటే భయపడిపోతారు. ఒకవేళ ఎక్కినా అక్కడి నుంచి కిందకు చూడాలంటే హడలిపోతారు. దీన్నే అక్రోఫోబియా అని పిలుస్తారు. ఈ ఫోబియాతో బాధపడే వారు ఎత్తులో ఉన్నప్పుడు తీవ్రమైన భయాందోళన చెందుతారు. తల తిరగడం, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం మొత్తం చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు, వికారం, కడుపులో అసౌకర్యం, నోరు ఎండిపోవడం, బలహీనం అయిపోతున్న అనుభూతి వంటి లక్షణాలు అనుభవిస్తారు. చిరాకు, ఉద్రేకం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి కొన్ని సందర్భాల్లో తీవ్రం కావచ్చు. ప్రాణాంతక పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే ఈ ఫోబియా నుంచి బయటపడటం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు. ఏం చేయాలో సూచిస్తున్నారు.

ఎందుకు వస్తుంది?

* నిజానికి అక్రోఫోబియాకు గురికావడంలో జీన్స్ కూడా ప్రధానపాత్ర పోషిస్తుంది. ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎవరికైనా ఉంటే రావొచ్చు.

* ఎత్తైన ప్రదేశాల్లో ఎదుర్కొన్న భయంకర ఘటనలు, ప్రమాదాలు ఇందుకు కారణం కావచ్చు. లేదంటే ఇతరులు చెప్పిన అనుభవాలు బ్రెయిన్ పై చెరగని ముద్ర వేసినప్పుడు కూడా ఈ ఫోబియా వస్తుంది.

* విపత్తు ఆలోచనలు, ఏం జరుగుతుందోననే అహేతుక నమ్మకాలు ఇందుకు దారితీయవచ్చు.

ఎలా నివారించాలి?

* మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి

ఎత్తులకు చేరుకున్నప్పుడు మీ శరీరంలో జరిగే మార్పులు, మానసికంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అర్థం చేసుకోండి. ఎలాంటి ఆపద రాదని మీ బ్రెయిన్ కు సర్దిచెప్పండి. ఈ పద్ధతి మీకు హెల్ప్ కావచ్చు.

* ఎక్స్ పోజర్ థెరపీ

ఎక్స్ పోజర్ థెరపీ ఇలాంటి భయాలను అధిగమించడంలో చాలా సాయపడుతుంది. అంటే క్రమంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడం, కాసేపు స్పెండ్ చేయడం వల్ల అలాంటి పరిస్థితులు తమకు ఎలాంటి ప్రమాదం తీసుకురావని మెదడుకి సిగ్నల్ వెళ్తుంది. ఈ భయం నుంచి విడుదల చేస్తుంది.

* సడలింపు పద్ధతులు పాటించండి

ఎత్తైన చోటుకు వెళ్ళినప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం, ధ్యానం చేయడం వంటివి ఉపశమనం కలిగించొచ్చు. భయం కలిగినప్పుడు ఉద్రేకాన్ని మేనేజ్ చేసేందుకు క్రమం తప్పకుండా ఈ టెక్నిక్ ఫాలో అవండి.

* ప్రతికూల ఆలోచనలు సవాల్ చేయండి

ఎత్తుల గురించి ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు అక్రోఫోబియాను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి ఈ ఆలోచనలను సవాలు చేయండి. అలాంటి నమ్మకాలను వదిలేసి ప్రాక్టికల్ గా ఉండండి. ఉదాహరణకు, పడిపోతామేమో, ఇక్కడే ఉంటే ఏదైనా విపత్తు కలుగుతుందేమో అని ఆలోచించే బదులు.. ప్రస్తుత క్షణంలో మీకు భద్రతగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టండి.

* మీకు ప్రియమైన వారితో మాట్లాడండి

హెల్పింగ్ నెట్‌వర్క్‌ని కలిగి ఉండటం వలన ఎత్తులంటే భయం పోయేలా మీకు ప్రోత్సాహం లభించవచ్చు. అవగాహన, ఆచరణాత్మక సహాయాన్ని అందించవచ్చు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఫోబియా ఉన్న వ్యక్తుల కోసం సపోర్ట్ గ్రూప్‌లో చేరడాన్ని పరిగణించండి.

Advertisement

Next Story

Most Viewed