- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Viral video : టవల్‌తో వీధిలోకి వచ్చి దుస్తులు మార్చుకున్న యువతి.. నడిరోడ్డు మీదే అలా చేస్తూ..
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అటెన్షన్ రావాలంటే ఏం చేయడానికైనా వెనుకాడరు అని చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు ఈ సుందరమైన స్త్రీని చూడండి. రీల్ చేయడానికి, ఈ అమ్మాయి టవల్ ధరించి వీధుల్లోకి వచ్చింది. అంతే కాదు రోడ్డు పై చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ బాటసారులకు షాక్ ఇచ్చింది. ప్రయాణికులు రాకపోకలు చేస్తుండగానే రోడ్డుపైనే బట్టలు మార్చుకోవడం మొదలు పెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ అమ్మాయిని బ్రెజిల్‌కు చెందిన 27 ఏళ్ల ఇంగ్రిడ్ ఒహారాగా గుర్తించారు. ఆమె తనను తాను నటిగా చూపించుకుని ఫేమస్ అవ్వాలనుకుందో ఏమో. ఈ వీడియోలో ఆ యువతి టవల్ ను చుట్టుకుని ట్రాలీ బ్యాగ్‌తో రోడ్డు పై నడుస్తూ కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూడటం ప్రారంభించగానే రోడ్డు పై కూర్చుని తన ట్రాలీ బ్యాగ్‌ని తెరిచి, అద్దం తీసి మేకప్ వేసుకోవడం ప్రారంభించింది. కొంతసేపటికి ఒంటి మీది టవల్ తీసివేస్తుంది. అయితే ఆ అమ్మాయి లోపల రెడ్ కలర్ గౌను వేసుకుంది. దీని తరువాత ఆమె చెప్పులు ధరించి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సీన్ చూసి అక్కడ ఉన్న చాలా మంది అయోమయంలో పడ్డారు.