- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శుద్ధి చేసిన నీరు కూడా ప్రమాదకరమే.. గోథే యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : నదులు, సముద్రాలు, చెరువుల్లోకి పరిశ్రమల నుంచి విడుదలయ్యే మురుగునీరు చేరడంవల్ల వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుందనే విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రత్యా్మ్నాయంగా ఆయా పరిశ్రమలు నీటిని శుద్ధి చేసి విడుదల చేసే ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా దశాబ్దాలుగా జరుగుతోంది. ఇలా చేయడంవల్ల ఎటువంటి హాని ఉండదని అందరూ భావిస్తారు. కానీ సహజ నీటి వనరుల్లోకి విడుదల చేసే ఈ శుద్ధి చేయబడిన మురుగునీరు కూడా పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్‌లో గల గోథే యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కర్మాగారాలు విడుదల చేసీ ఈ ‘శుద్ధి చేసిన’ నీరు సహజ నీటి వనరులను, అందులో నివసించే జీవులకు హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని వారు నిరూపించారు. ముఖ్యంగా ‘అకశేరుకాల యొక్క జాతుల కూర్పు’పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతున్నట్లు కనుగొన్నారు.
కర్మాగారాలు శుద్ధి చేసిన నీరు సహజ నీటివనరులు, వాటిపై ఆధారపడిన జీవులపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నిపుణులు జర్మన్ నగర సమీపంలో, హెస్సేలోని 170 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు విడుదల చేసే నీటిపై కొంతకాలం పరిశోధనలు నిర్వహించారు. ఆ నీరు నదులలోని అకశేరుకాల జాతుల కూర్పుపై ప్రభావం చూపుతోందని, కొంతకాలానికి జలచరాలు చనిపోతున్నాయని గుర్తించారు. శుద్ధి చేసిన మురుగునీరు కొన్ని కాలుష్య కారకాలను తొలగించడం వాస్తవమే అయినప్పటికీ, అది ఉపరితల నీటిపై మాత్రమే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. పైగా మురుగునీటి నుంచి హానికరమైన మైక్రోపోల్యూటెంట్స్‌ను పూర్తిగా తొలగించే మురుగునీటి శుద్ధి కర్మాగారాల సామర్థ్యం ప్రపంచ వ్యాప్తంగా చాలావరకు పరిమితంగా, బలహీనంగా ఉంటోందని చెప్తున్నారు. కర్మాగారాలు ద్వారా విడుదలయ్యే శుద్ధి చేసిన నీటిలో కూడా ఫార్మాస్యూటికల్ సమ్మేళనాలు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, పురుగుమందులు, కృత్రిమ పదార్థాల వంటి సూక్ష్మ కాలుష్య కారకాలు ఉంటున్నాయని కనుగొన్నారు. ఇవి సహజ నీటి వనరులను, వాటిని వినియోగించే జీవులను ప్రభావితం చేస్తాయని, పర్యావరణానికి హాని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా స్టోన్‌ఫ్లై అండ్ కాడిస్‌ఫ్లై లార్వా వంటి శుద్ధి చేయబడిన వ్యర్ధాల వల్ల జలచరాలు కొంతకాలానికే చనిపోతున్నాయని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నీటి కాలుష్యాన్ని నివారించే విషయంలో మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరాన్ని సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు.
Read More: సహజీవనం చేస్తున్న మహిళకు కూడా పార్టనర్ ఆస్తిపై హక్కు ఉంటుందా?