- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలకూ ఫీలింగ్స్ ఉంటాయి.. వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
దిశ,ఫీచర్స్ : మొక్కలకు ప్రాణమే కాదు ఫీలింగ్స్ కూడా ఉంటాయని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్పర్శ ప్రారంభమైనప్పుడు, ఆగిపోయినప్పుడు మొక్కలు వేర్వేరుగా స్పందిస్తాయని.. నరాలు లేకపోయినా వాటిని తాకినప్పుడు ప్రతిస్పందనగా కదులుతాయని చెప్తున్నారు. ఎక్స్‌పరిమెంట్ టైమ్‌లో ప్లాంట్ సెల్స్ ఇతర ప్లాంట్ సెల్స్‌కు కాల్షియం సిగ్నల్స్ వేవ్‌ను స్లోగా పంపడం ద్వారా చక్కటి గ్లాస్ రాడ్ స్పర్శకు ప్రతిస్పందించాయి. టచ్ సందర్భంలో ప్రెషర్ రిలీజ్ అయినప్పుడు అవి మరింత వేగవంతమైన తరంగాలను పంపుతాయి. మొక్కలు స్పర్శకు ప్రతిస్పందించగలవని సైంటిస్టులకు తెలిసినప్పటికీ, అది ప్రారంభమైనప్పుడు, ముగిసినప్పుడు మొక్కల కణాలు వేర్వేరు సంకేతాలను పంపుతాయనేది తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్లాంట్ సెల్స్ చాలా సెన్సిటివ్‌గా ఉండటం, జంతువుల కంటే భిన్నమైన రీతిలో, నరాలు లేకుండానే చక్కగా ప్రతిస్పందించడం, ప్రెషర్‌ను గ్రహించడం ఆశ్చర్యంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాదు ప్లాంట్ సెల్స్ బలమైన సెల్యులార్ వాల్స్‌ను కలిగి ఉన్నాయని, అవి ఎక్కువ ఫ్లూయిడ్ పొరలతో ఉంటాయని తెలిపారు. తేలికపాటి స్పర్శ వల్ల కూడా మొక్క కణంలో ఒత్తిడిని తాత్కాలికంగా పెంచుతాయన్నారు. మనుషుల్లో, వివిధ జంతువుల్లో ఆర్గాన్ సెల్స్ ద్వారా స్పర్శ తెలుస్తుంది. కానీ మొక్కలలోని మెకానిజం ఇంటర్నల్ కణాల పీడనం పెరుగుదల లేదా తగ్గుదల ద్వారా ఇది సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్ అధ్యయనాలలో సిగ్నల్‌ను వివిధ మార్గాల్లో ప్రేరేపిండం ద్వారా మొక్కల్లో స్పర్శ, భావాలు వంటివి ఎలా ఉంటాయో మరింత తెలుసుకుంటామని పరిశోధకులు పేర్కొన్నారు.
Read More: మందు ఎందుకు తాగుతారు?.. మందుబాబుల ఇంట్రెస్టింగ్ థాట్స్ మీకోసం..