- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డయాబెటిస్ 1.5.. ఇటీవల ఎందుకు పెరుగుతోంది?
దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ రకాల్లో టైమ్ 1, టైప్ 2 గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య మరో కొత్తరకం మధుమేహం బాధితులు కూడా పెరుగుతున్నారు. ఇది ఇతర అనారోగ్యాలకు కారణం అవుతోంది. అయితే చాలామంది బాధితులకు తాము 1.5 డయాబెటీస్ బారిన పడినట్లు త్వరగా గుర్తించలేకపోతున్నారట. శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేసే కణాలపై ప్రతిరోధకాలు (యాంటీబాడీస్) దాడిచేసినప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది అరుదుగా వస్తుంది. 30 ఏండ్లు పైబడిన వారిలోనూ రావచ్చు.
టైప్ 1.5 బాధితులు సాధారణం కంటే ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లడం (పాలియూరియా). అధిక దాహం (పాలిడిప్సియా), రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకోసం లేవాల్సి రావడం (నోక్టురియా), తరచూ అలసట, కంటిచూపు లోపాలు, కాళ్లల్లో జలదరింపు వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాగే బరువు తగ్గడం కూడా టైప్ 1.5 మధుమేహం లక్షణాల్లో ఒకటి. దాదాపు ఇది టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఉన్నప్పటికీ, అంత రిస్కును కలిగించేది అయితే కాదు. పైగా సింప్టమ్స్, ప్రభావం కూడా వెంటనే కనిపించవు. పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామాలు, లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్‌వల్ల దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే లక్షణాలు అధికమైనప్పుడు మాత్రం ఇన్సులిన్ ప్రక్రియ అవసరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధిని గుర్తించడానికి బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను టెస్టు చేయించుకోవాలి. అలాగే లిపిడ్ ప్రొఫైల్, అల్బుమిన్, పెరిఫెరల్ న్యూరోపతి, రెటినోపతి వంటి టెస్టులు అవసరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. తగిన కేర్ తీసుకుంటే డయాబెటిస్ 1.5 వల్ల ఏర్పడబోయే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.