- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో దెబ్బతినే 5 పార్ట్స్ ఇవే..!!
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా మధుమేహం బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దేశంలో సగానికి సగానికి పైగా మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. ఆహారపు అలవాట్ల నుంచి నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల టైప్ -2 డయాబెటిస్‌కు కారణమవుతున్నాయి.
ఈ దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది గుర్తించలేరు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు అలసట, కాళ్లు తిమ్మిరి, ఊబకాయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలోని షుగర్ లెవల్స్ బాడీలోని ఇతర పార్ట్స్ ను కూడా ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గుండె: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గెండెను దెబ్బతీస్తాయి కాబట్టి చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంచుకోవాలి.
కళ్లు: డయాబెటిస్ కంటి సమస్యలను పెంచుతుంది. కంటిలో శుక్లాలు వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అధిక షుగర్ లెవల్స్ కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి.
చర్మం: డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. షుగర్ లెవల్స్ అధికంగా పెరగడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీంతో పిగ్మెంటేషన్ సమస్యలు కూడా వస్తాయి. మెడ, చేతుల, పాదాల దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే డయాబెటిస్ వ్యాధిని ఈజీగా కనుగొనవచ్చు.
కిడ్నీ: శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కిడ్నీ. చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీస్తుంది. షుగర్ మూత్రపిండాల పనితీరును నిరోధిస్తుంది.
పాదాలు: రోజురోజుకు పాదాల్లో సున్నితత్వం పెరగడం, తిమ్మిర్లు రావడం వంటివి డయాబెటిస్ లక్షణాలు. ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. రక్తంలో అధిక చక్కెర రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించి వైద్యుడ్ని సంప్రదించడం మేలంటున్నారు నిపుణులు.