- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్లమెంట్‌లో ఆమె చేసిన పనికి రియాక్షన్ ఇదే.. ఏం చేసిందంటే..
దిశ, ఫీచర్ : కొన్ని సందర్భాలు ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తాయో చెప్పలేం. కొందరి మాటలు.. చేష్టలు ఎందుకు ఆకట్టుకుంటాయో కూడా అంచనా వేయలేం. కానీ ఒక్కోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు, సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ న్యూజిలాండ్ పార్లమెంట్‌లో అదే జరిగింది. సభలో మాట్లాడుతున్న ఒక మహిళా పొలిటీషియన్ ప్రసగం ఆ సభనే కాదు, చూసినవారందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఈ పవర్ ఫుల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూసిన వారంతా ‘గ్రేట్ పొలిటీషియన్, ప్రజలకోసం పోరాడే వ్యక్తి అంటే ఇలా ఉండాలి?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఏం జరిగింది?
న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ అండ్ హామిల్టన్ ప్రాంతాల మధ్య గల హంట్లీ అనే ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి పేరే హనా రౌహితీ మైపీ-క్లార్క్ (hana-Rawhiti Maipi Clark). ఈమె వయస్సు కేవలం 21 సంవత్సరాలు. గత 170 సంవత్సరాల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలోనే అతిచిన్న వయస్సుగల ఎంపీ కావడం విశేషం. 2008 నుంచి ‘హౌరాకి-వైకాటో’ అనే పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈమెను గత సంవత్సరం అక్టోబర్‌లో న్యూజిలాండ్ సీనియర్ ఎంపీలలో ఒకరైన నానాయా మహుతాను (Nanaia Mahuta) పార్లమెంటుకు ఎంపిక చేశారు. ఈమె తన సొంత పట్టణం అయిన హంట్లీ పట్టణ పరిధిలో, అలాగే హౌరాకి వైకాటో నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఉండే మావోరీ అనే స్థానిక కమ్యూనిటీల హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతూ వస్తోంది. ఆమె తాత, తైతిము మైపి, కూడా మావోరీ కమ్యూనిటీ సంఘం అయిన ‘న్గా టమాటోవాలో’ సభ్యుడు.
అయితే గత నెలలో జరిగిన న్యూజిలాండ్ పార్లమెంట్ సమావేశాల్లో మైపి-క్లార్క్ తన కమ్యూనిటీకి సంబంధించిన సాంప్రదాయ ‘హాకా’ లేదా ‘యుద్ధం’ ప్రదర్శించినంత పనిచేసింది. అంతకు ముందు ఆమె ‘నేను మీ కోసం చనిపోతాను.. కానీ నేను కూడా మీ కోసం జీవిస్తాను’ (I will die for you ... but I will also live for you) అని తన ఓటర్లకు హామీ ఇచ్చింది. దానిని నిలబట్టుకునే ఉద్దేశంతో తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే మావోరి కమ్యూనిటీ సమస్యలపై గళం విప్పింది. ‘‘జీవితమంతా వెనుకబడి ఉన్న తమ కమ్యూనిటీ ప్రజలు మాతృభాషను నిలబెట్టుకోవాలని, చదువుకోవాలని, అభివృద్ధి ఫలాలు తమకు అందాలని తరతరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ మా హక్కులను, మా సాంప్రదాయాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అంటూ ఓ రేంజ్‌లో మావోరి కమ్యూనిటీ సాంప్రదాయ ‘హాకా’ కళను అనుకరిస్తూ ప్రసంగించింది మైపి క్లార్క్. అంతేకాదు ‘‘ఈ ప్రభుత్వం నా ప్రపంచంపై దాడి చేసింది. హెల్త్, తయావో (పర్యావరణం), వై (నీరు), వెన్యువా (భూమి), సహజ వనరులు, మావోరీ వార్డులు, రెయో (భాష) వంటి హక్కులను కాలరాసింది’’ అంటూ విరుచుకుపడింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024