- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాఫ్ట్ క్యాంపెయిన్.. ఇదే ఆ నేతల చాయిస్..
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తే దుమ్మురేపే క్యాంపెయిన్‌లు, మాటల గారడీలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఢీ అంటే ఢీ అనే రీతిలో రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తాయి. ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలు, కోడ్ ఉల్లంఘించే పనులు, ప్రలోభాలు, తాయిలాలు, అతిశయపు హామీలు, కొన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి అనూహ్య రీతిలో వేషధారణ, పర్యటనలు, టెంపుల్ రన్‌లు చేస్తుంటారు నేతలు. వీటికితోడు అప్పుడప్పుడు ఓటర్ల మనుసు గెలుచుకోజూస్తుంటారు. సున్నితపు మాటలు, నేరుగా మాట్లాడటం, ఇళ్లల్లోకి వెళ్లడం, బంధువుల్లా కలిసిపోవడం వంటి జిమ్మిక్కులూ సాఫ్ట్ క్యాంపెయిన్‌లో భాగంగా చేస్తుంటారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలూ ఇదే విధంగా సాగుతున్నాయి. అసోంలో సీఏఏ చట్టాల రద్దు, ఇంధన ధరల తగ్గింపు, అభివృద్ధి, కార్మికుల వేతనాల పెంపు వంటి హామీలు ఇప్పటికే వినిపించాయి. పోలింగ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ నేతలు హై వోల్టేజ్ ప్రచారాలతోపాటు కొన్ని సాఫ్ట్ క్యాంపెయిన్‌లనూ నిర్వహించారు.
ఒక్క షాట్… రెండు పిట్టలు
ప్రధాని మోడీ రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కరోనా షాట్ తీసుకున్నారు. ఒక్క షాట్ తీసుకుని టీకాపై అపోహలను దూరం చేయడానికి దోహదపడ్డారన్న మాటలతోపాటు అసోం ప్రజల మనస్సుకూ దగ్గరవ్వడానికి గురిపెట్టారు. టీకా తీసుకుంటూ ప్రధాని భుజంపై వేసుకున్న అస్సామీల గమోచా(కండువా)తో పార్టీని బలోపేతం చేయడానికి పరోక్షంగా ప్రయత్నించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలతో బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో మోడీ ఒక ఊపునిచ్చారని చర్చిస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఇక్కడ తేయాకు కార్మికులతో ముచ్చటించారు. వారితోపాటు తోటలోకి వెళ్లి ఆకులను తెంపారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన తీసుకురాలేదు. వారితో మాట్లాడకున్నా రాష్ట్ర ప్రజల్లో ఒకరకమైన సుహృద్భావన కలిగించడానికి ప్రయత్నించారు. మరోచోట అక్కడి బాలికలతో సాంప్రదాయ సంగీతానికి నృత్యం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని, తేయాకు కార్మికుల వేతనాలు పెంచుతామని ఆ పార్టీ హామీలనూ కురిపించింది.
రాహుల్ గాంధీ పుష్ అప్స్, స్విమ్మింగ్
వయానాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ కేరళ, తమిళనాడులో విస్తృత ప్రచారం చేస్తున్నారు. సులువుగా ప్రజల్లో కలిసిపోయి అబ్బురపరుస్తున్నారు. మత్స్యకారులతో కలిసి వెళ్లి ఈతకొట్టారు. ఈ సందర్భంగా రాహుల్ సిక్స్ ప్యాక్ మజిల్స్, బైసెప్స్‌పై పెద్ద చర్చే జరిగింది. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలూ చూపించారు. విద్యార్థులతో కలిసి పుష్ అప్స్ తీసి చుట్టుపక్కల వాతావరణంలో హుషారు నింపారు. 15 పుష్ అప్స్ చాలెంజ్ స్వీకరించి వావ్ అనిపించారు. వన్ హ్యాండ్ పుష్ అప్స్, మార్షల్ ఆర్ట్స్ కిటుకులను ప్రదర్శించారు.
బెంగాల్‌లో స్కూటీ రైడ్లు
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు సైకిళ్లు తొక్కుతూ నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అదే తీరులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై వ్యతిరేకతను బయటపెడుతూ ఎలక్ట్రిక్ స్కూటీపై ప్రయాణించారు. రాష్ట్ర మంత్రి ఫిర్హద్ హకీం స్కూటీ వెనుకాల పిలియన్ రైడర్‌గా కూర్చుని పెట్రోల్, డీజిల్ రేట్లను నిరసిస్తూ ఓ ప్లకార్డు పట్టుకున్నారు. తర్వాతి రోజే స్మృతి ఇరానీ బెంగాల్‌లో స్కూటీపై మెరిశారు.