- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి స్వగ్రామంలో ముస్లింల సాంఘిక బహిష్కరణ!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం వేల్పూరులో 150 ముస్లిం కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసినట్లు సమాచారం. సాంఘిక బహిష్కరణ చేసి వేధిస్తున్న గ్రామాభివృద్ధి కమిటిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ఇద్రీస్ ఖాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసిఆర్, డీజీపీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఏం అదినేత అసదుద్ధిన్, నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. వేల్పూర్ గ్రామంలో ఉన్న ఈద్గాకు చెందిన స్థలంలో వక్ప్ బోర్డు నిధులతో ప్రహారీ నిర్మాణం చేయకుండా గ్రామాభివృద్ధి కమిటీ అడ్డుకుందని, ప్రశ్నిస్తే సాంఘీక బహిష్కరణ చేసి వేధిస్తున్నారని పిర్యాదు చేశారు. లాక్ డౌన్ కాలంలో సాంఘీక బహిస్కరణ కారణంగా పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ మేరకు డిప్యూటి మేయర్, అధికారులు, ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ లో ట్విట్ చేశారు.