- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసుపత్రిలో అఘాయిత్యం.. టెస్టులు చేయాలంటూ గర్భిణీపై అత్యాచారయత్నం
దిశ, కోదాడ: రోజురోజుకు సమాజంలో కీచక పర్వం ఎక్కువైపోతోంది. మహిళలపై మృగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. గుడి, బడి, ఆసుపత్రి అని కూడా చూడకుండా కామంతో కళ్లుమూసుకుపోయి కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రసవం కోసం వచ్చిన గర్భిణీపై ఓ ల్యాబ్ టెక్నీషియన్ అత్యచారానికి పాల్పడిన దారుణ ఘటన కోదాడలో ఆలస్యంగా వెలుగుచూసింది.
చిలుకూరు మండలం శీతలతండ గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణీ ప్రసవం కోసం ఈ నెల 10 వ తేదిన అర్ధరాత్రి సమయంలో కోదాడలోని తిరుమల హాస్పటల్ కు వచ్చింది. గర్భిణికి సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలంటూ వైద్యులు తెలపడంతో ల్యాబ్ కి తరలించారు. అనంతరం ల్యాబ్ లో ఉన్న టెక్నీషియన్ శ్రీకాంత్ గర్భిణీ పై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో భాదితురాలు కేకలు వేయడంతో మహిళ బంధువులు శ్రీకాంత్ కు దేహశుద్ది చేసి, అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు వాపస్ తీసుకోవాలని, ఈ ఘటన వలన తమ ఆసుపత్రి పరువు పోతుందని ఆసుపత్రి నిర్వాహకులు ఓ ప్రజాప్రతినిధితో కలిసి బాధితురాలిని బెదిరిస్తున్నారని సమాచారం.