ఇండియన్- 2 ఇన్సిడెంట్ ఎఫెక్ట్

by Shyam |   ( Updated:2020-02-26 03:22:47.0  )
ఇండియన్- 2 ఇన్సిడెంట్ ఎఫెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ 2 సినిమా… సినీ చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనను ఎదుర్కొంది. సెట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా…. మరెందరో సినీ కార్మికులు గాయపడ్డారు. ఆ ఘటన నుంచి చిత్రబృందం ఇంకా తేరుకోలేక పోతోంది. ఈ క్రమంలోనే సినీ కార్మికుల సంక్షేమానికి ముందుకొచ్చాడు నిర్మాత సురేష్ కామాక్షి. శింబు హీరోగా నటిస్తున్న మానాడు చిత్రానికి సురేష్ కామాక్షి నిర్మాత కాగా… ఈ సినిమాకు పనిచేస్తున్న కార్మికులకు బీమా చేయించారట. హీరో నుంచి లైట్ బాయ్ వరకు రూ. 30 కోట్ల విలువైన బీమా చేయించారట. ఇందుకోసం రూ.7.8 లక్షలు ప్రీమియంగా చెల్లించారని తెలుస్తోంది. దీనిపై కార్మికులు సంతోషం వ్యక్తం చేశారట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన సినిమా యూనిట్స్ కూడా కార్మికుల కోసం బీమా చేయించాలని కోరుతూ నిర్మాత సురేష్ కామాక్షికి ధన్యవాదాలు తెలిపారట.

Advertisement

Next Story