- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండల్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం : KTR హామీ.. ఎవరీ కొండల్.?
X
దిశ, చండూరు : ఉస్మానియా విద్యార్థి మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు తిరుమణి కొండల్ ప్రజాపతి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరుగని ఉద్యమం చేసిన చండూరు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తిరుమణి కొండల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం ఏడాది పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్.. కొండల్ కుటుంబ సభ్యులతో వెళ్లి బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొండల్ చేసిన ఉద్యమం అనితర సాధ్యమని అన్నారు. కొండల్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కొండల్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story