కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత

by Anukaran |   ( Updated:2020-07-25 03:47:21.0  )
కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామంలోని వెల్సపన్ ఇంటర్ నేషనల్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వెళ్తున్న మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో 111 జీవోను ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైయిందన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 111 జీవోను రద్దు చేస్తామని చెప్పారు.

కానీ, ఇప్పటి వరకు రద్దు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని స్ధానిక ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకొని 111 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు పాల్గోని కేటీఆర్ కాన్వాయ్ ని నిలివేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులపై అడ్డు తొలగించేందుకు లాఠీచార్జీ చేశారు.

Advertisement

Next Story