- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 2న అసలైన విమోచనా దినోత్సవం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు అసలైన విమోచనా దినోత్సవం జూన్ 2వ తేదీన మాత్రమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతీ ఏటా సెప్టెంబరు 17వ తేదీని విమోచనా దినోత్సవంగా జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్న సమయంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సెప్టెంబరు 17వ తేదీని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సందర్భంగా ముమ్మాటికీ ఇది విలీన దినోత్సవం మాత్రమేనని అన్నారు. దేశ ప్రజలందరికీ ఆగస్టు 15వ తేదీన పూర్తి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబరు 17వ తేదీన వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సరికొత్త నిర్వచనం ఇవ్వడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పార్టీ అధ్యక్షుడి తర్వాత కీలకమైన హోదాలో ఉన్న సెక్రటరీ జనరల్ కేశవరావు సెప్టెంబరు 17వ తేదీన విలీన దినంగానూ, స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుగానూ వ్యాఖ్యానిస్తే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ మాత్రం అసలైన విమోచనా దినోత్సవం జూన్ 2వ తేదీ మాత్రమేనంటూ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించడం మరో కొత్త వివాదానికి తెర లేపినట్లయింది. ప్రతీ ఏటా జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఇదే రోజును విమోచనా దినోత్సవంగా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.