- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోదాడ ‘రేస్’ ప్రభంజనం.. రాష్ట్రం స్థాయిలో సెకెండ్ ప్లేస్..
దిశ, కోదాడ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో కోదాడకి చెందిన రేస్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. కళాశాలకు చెందిన భూమి రెడ్డి సాయి గీత, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది.
అంతేకాకుండా కళాశాల నుంచి విద్యార్థులు చిలకల సాయిశ్రీ 463, వినుకొల్లు గాయత్రి 463, శివాని 461, మృదుల 461, యశ్వంత్ 461 తో పాటు మరి కొంత మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
గతంలో జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ లో కూడా జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ లో రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించామన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.