పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Shyam |
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, అంబర్ పేట్: పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ కమిటీ సమావేశం ఆదివారం హిమాయత్ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాబోవు ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి పాల్గొన్నారు.

Advertisement

Next Story