- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే వధువును కారులో ఎత్తుకెళ్లి..
దిశ, గోదావరిఖని : కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని అపహరించుకుపోయిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. csp కాలనీకి చెందిన సాయి కృష్ణ, హైదరాబాద్ ఉప్పల్‌లోని చిలుకనగర్‌కు చెందిన శ్రీశాంక.. అక్టోబర్ 1వ తేదీన ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి గోదావరిఖని ఒకటవ పట్టణ పోలీసులను వారిద్దరూ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు.
అయితే మంగళవారం ఉదయం 5 గంటలకు యువతీ కుటుంబ సభ్యులు తమ కూతురిని చూపించమని యువకుడి ఇంటికి వచ్చి అడిగారు. దీంతో సాయికృష్ణ ఫ్యామిలీకి వారిపై అనుమానం కలగడంతో వారు చూపించలేదు. మళ్ళీ తిరిగి 7.30 ప్రాంతంలో ఓ షిఫ్ట్ కారులో స్థానిక గోదావరిఖని ధూల్‌పేటకు చెందిన ఓ రౌడీ షీటర్‌తో పాటు మరికొంత మందితో కలిసి ఆయుధాలు, కర్రలతో బెదిరించి యువతికి ఎత్తుకెళ్లిపోయారు. దీంతో సమాచారం అందుకున్న సీఐ రమేష్ బాబు, ఎస్ఐ సతీష్ కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.