బస్సెక్కిన కవితకు చుక్కెదురు

by Shyam |
బస్సెక్కిన కవితకు చుక్కెదురు
X

తెలంగాణ బ్యూరో : ఎల్బీ స్టేడియంలో జరగుతున్న టీఆర్ఎస్ సభకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్సీ కవిత తన కారును వదిలి కార్యకర్తలతో కలిసి కవాడిగూడ నుంచి ఆర్టీసీ బస్ లో బయలు దేరింది. అయితే కవిత ప్రయాణిస్తున్న బస్సు ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి రాగానే ఆగిపోయింది. డ్రైవర్ ఎంత స్టార్ట్‌ చేసినా మొరాయించింది. అలాగే చాలా సమయం సతాయించింది. దీంతో చేసేది ఏం లేక కవిత మరో బస్సులో ఎల్బీ స్టేడియానికి వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ నిర్వాహణ ఎలా ఉందో కవిత ఎక్కిన బస్ ఓ ఉదాహరణ అని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story