హీరో, ఫిల్మ్ మేకర్ మధ్య చిచ్చుపెట్టిన కరోనా.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే!

by Shyam |
Dostana 2
X

దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. 2019లో తన ప్రొడక్షన్ హౌస్ ధర్మ మూవీస్‌లో ‘దోస్తానా 2’ సినిమా ప్రకటించారు. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా మూవీ అనౌన్స్ చేసినా.. ఇప్పటిదాకా షూటింగ్ డిలే అవుతూనే ఉంది. కరోనా కారణంగా ఇలా జరుగుతోందని అనుకున్నా.. కార్తీక్, కరణ్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో పాటు రాపో సరిగా లేకపోవడమే అసలు కారణమని తెలుస్తోంది. అంతేకాదు కార్తీక్ అటు జాన్వీతో కూడా క్లోజ్‌గా మూవ్ కాలేకపోతున్నాడని సమాచారం.

ముందు నుంచి డేట్స్, షెడ్యూల్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పిన కార్తీక్.. కరోనా కారణంగా ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయకపోవడమే మంచిదని కరణ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కరణ్ కూడా కార్తీక్‌ను ఫోర్స్ చేయలేదట. కానీ ఇన్ని రీజన్స్ చెప్పిన కార్తీక్.. ఈ గ్యాప్‌లో రామ్ మాద్వానీ దర్శకత్వంలో వచ్చిన ‘ధమాకా’ సినిమాలో నటించడం కరణ్‌కు కోపం తెప్పించిందని, ఈ మేరకు ఓ ఇండోర్ మీటింగ్‌లో తన డిజప్పాయింట్‌మెంట్ ఎక్స్‌ప్రెస్ చేశాడని తెలుస్తోంది.

ఇక కార్తీక్ విషయానికొస్తే.. శశాంక్ కైతాన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘యోధ’ సినిమా ఆఫర్‌‌ను షాహిద్ కపూర్‌కు ఇచ్చిన ధర్మ బ్యానర్‌ నిర్ణయంతో అప్‌సెట్ అయ్యాడట. షాహిద్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా తనను అప్రోచ్ కాకపోవడం.. ఆ ఆఫర్ మరొకరికి ఇవ్వడం తనకు నచ్చలేదట. ఆ తర్వాత ‘దోస్తానా 2’ డేట్స్ లేవని.. కరణ్ ‘మిస్టర్ లేలే’ సినిమా షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడట. విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ మిడిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా తను ‘దోస్తానా 2’ కోసం ఏప్రిల్‌లో మాత్రమే డేట్స్ ఇవ్వగలనని ధర్మ మూవీస్‌కు ఇన్‌ఫార్మ్ చేశాడట కార్తీక్. దీంతో తను కావాలనే ఇదంతా చేస్తున్నాడని నిర్ణయించుకున్న కరణ్.. ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారని తెలుస్తోంది. ఇక తనతో భవిష్యత్తులోనూ సినిమాలు తీసేది లేదని నిర్ణయించుకున్నాడట.

Advertisement

Next Story