హిందీ బిగ్ బాస్‌పై కర్ణిసేన ఫైర్

by Shyam |
హిందీ బిగ్ బాస్‌పై కర్ణిసేన ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ బిగ్ బాస్ సీజన్ 14 అక్టోబర్ 3న ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌ చేస్తున్న ఈ షో ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తి కాకముందే రెండు సార్లు నోటీసులు అందుకుంది. మొదట్లో మరాఠీ లాంగ్వేజ్‌పై కంటెస్టెంట్ జాన్ కుమార్ సను చేసిన కామెంట్స్‌తో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్ఎన్ఎస్, శివసేన.. జాన్ కుమార్ సనుతోపాటు షో ప్రసారం చేసే కలర్ టీవీ చానల్ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

ఇక ఇప్పుడు ఇజాజ్ ఖాన్, పవిత్ర పునియా పబ్లిక్ రిలేషన్‌పై ఫైర్ అయిన కర్ణిసేన నోటీసులు జారీ చేసింది. రీసెంట్ ఎపిసోడ్స్‌లో ఇద్దరూ కూడా పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వల్గారిటీ స్ప్రెడ్ చేస్తూ దేశాన్ని పాడు చేస్తున్న బిగ్ బాస్ షో.. లవ్ జిహాద్‌ను ఎంకరేజ్ చేస్తుందని.. షోను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

Advertisement

Next Story