- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటర్ జంక్షన్‌గా కరీంనగర్: ఈటల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వాటర్ జంక్షన్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో నిర్మించాల్సిన చెక్ డ్యాంల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో.. సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మొదటి సారి వినియోగించుకునే అవకాశం కరీంనగర్‌కే దక్కడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత జళ కళ ఉట్టిపడుతోందని, భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యాయన్నారు.
కాళేశ్వరం నుంచి లిఫ్ట్ ద్వారా తరలిస్తున్న ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారని ఈటల తెలిపారు. నీరు వృథాగా పోకుండా చెక్ డ్యాంలను నిర్మించాలని ఆదేశించారని, పంపింగ్ ద్వారా నీళ్లు వస్తున్నందున జీవో నెంబర్ 8 కరీంనగర్‌కు వర్తించదని ఈటెల చెప్పారు. ఈ కారణంగానే చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని. ఇందుకు నిధులు వృథా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చెక్ డ్యాంల వల్ల ముంపునకు గురి కాకుండా ఉండే ప్రదేశాలను ఎంచుకోవాలని అధికారులను ఆదేశించామని ఈటెల రాజేందర్ అన్నారు. ఇంజనీర్లు సైట్ విజిట్ చేసిన తర్వాత మాత్రమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జిల్లాలో పనిచేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులను సిబ్బందిని ఇతరాత్ర పనులు అప్పగించకూడదని ఆదేశాలు జారీ చేశామని మంత్రి చెప్పారు. చెక్ డ్యాం నిర్మాణ పనులు అప్పగించే కంపెనీలకు అనుభవంతో పాటు మిషనరీ ఉంటేనే అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు సిద్ధం అయిన వారం రోజుల్లో నిధులు మంజూరు చేయించే బాధ్యత తమదేనని మంత్రి రాజేందర్ చెప్పారు.