కంగనా సిస్టర్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండెడ్

by Shyam |
కంగనా సిస్టర్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండెడ్
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం మనాలిలోని తన నివాసంలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది. తల్లిదండ్రులు, సోదరి రంగోలి చందేల్ తో కలిసి లాక్ డౌన్ పీరియడ్ ను హ్యాపీగా గడుపుతోంది. కంగనాకు అసలు సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా… తన సోదరి రంగోలి తన అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు కంగనా ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. కొత్త సినిమాల కబుర్లు, కంగనాకు సంబంధించిన స్పెషల్ పిక్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో రాజకీయాలు, సినిమాల గురించి ప్రస్తావిస్తూ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రతీ విషయాన్ని కాంట్రవర్సీ చేసేందుకు ప్రయత్నిస్తూ విమర్శలపాలు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య రంగోలి మతపరమైన విషయాల్లో కామెంట్ చేస్తూ… ద్వేషాన్ని రగిలించేందుకు ప్రయత్నించింది అని … తన అభిప్రాయాల ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిందని… వరుస ట్వీట్లతో ఇస్లామొఫోబియా ప్రేరేపించి నందుకుగాను…. ట్విట్టర్ తన అకౌంట్ ను సస్పెండ్ చేసింది. ట్విట్టర్ రూల్స్ అతిక్రమించినందుకు గాను రంగోలి అకౌంట్ ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

కాగా రంగోలి బాలీవుడ్ లో ఓ బ్యాచ్ గురించి ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. నా చెల్లి ఎప్పుడూ గొప్పా… పక్క వాళ్ళు పనికిరారు అనే విధంగా పోస్టులు పెడుతుంది అంటారు నెటిజన్లు. అంతటితో ఆగకుండా ప్రతి రాజకీయ అంశంపై రచ్చ చేస్తూ… దేశానికి సంబంధించిన ప్రతీ విషయంపై కలుగజేసుకుని… తీవ్ర విమర్శలకు దిగుతుంది. ఈ మధ్య తాజ్ మహల్ పై కూడా కామెంట్స్ చేసి వివాదాలు సృష్టంచి… విమర్శలపాలైంది రంగోలి. అంతే కాదు ఇలాంటి రెచ్చగొట్టే పోస్టుల వల్లే… గతంలో రంగోలి ఇన్ స్టాగ్రాం అకౌంట్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

Tags : Kangana Ranaut, Rangoli Chandel, Bollywood, Twitter

Advertisement

Next Story