ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టిన బాలీవుడ్ క్వీన్

by Sumithra |   ( Updated:2021-06-09 04:21:57.0  )
Kangana Ranauth
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హైయెస్ట్ టాక్స్ పేయర్స్‌లో ఒకరు కాగా.. ప్రతీ ఏటా తన ఇన్‌కమ్‌లో 14శాతం టాక్స్‌ రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిపింది. అయితే గతేడాది కరోనా కారణంగా పనిలేకపోవడం వల్ల సగం పన్ను మాత్రమే చెల్లించానని, ఇప్పటికీ మిగిలిన టాక్స్ చెల్లించ లేకపోయానని తెలిపింది. లైఫ్‌లో ఇది ఫస్ట్ టైమ్ అన్న కంగన.. గవర్నమెంట్ పెండింగ్ టాక్స్‌పై వడ్డీ వసూల్ చేస్తుందని వివరించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపింది. ఇండివిడ్యువల్‌గా ప్రతీ ఒక్కరికి ఇది టఫ్ టైమ్ కానీ అందరం కలిస్తే ఈ పరిస్థితిని ఎదుర్కోగలమని చెప్పింది. ఇక ముంబై వర్షాలు చాలా రొమాంటిక్‌గా ఉన్నాయన్న కంగన.. సింగిల్ పీపుల్ డ్రీమ్స్‌లోనే బతకాల్సి వస్తుందని తెలిపింది. తన పార్ట్‌నర్‌ను చూపిస్తే బాగుంటుంది కదా! అంటోంది భామ.

Advertisement

Next Story