- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెండింగ్‌లో ‘పిల్ల కట్నం’
దిశ, హైదరబాద్: కరోనా ఎన్ని కష్టాలు తెచ్చినా పేదల సంక్షేమానికి ఎలాంటి లోటు రానిచ్చే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అందించే పెళ్లి కానుక సాయానికి సంబంధించి నిధుల విడుదలలో జాప్యం కొనసాగుతూనే ఉంది. పెండింగ్ దరఖాస్తులను అధికారులు క్లియర్ చేస్తున్న నిధుల విడుదలకు నోచుకోవడం లేదు. సమ్మర్‌లో ముహుర్తాలు ఎక్కువగా ఉండటం, పెళ్లి ఖర్చులకు ప్రభుత్వ అందించే సాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందనుకున్న సమయంలో కరోనా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2,932 కల్యాణలక్ష్మి, 3,353 షాదీ ముబారక్ దరఖాస్తులకు సుమారు రూ.62 కోట్లు అవసరమవుతుంది.నిధుల విడుదలకు అయ్యే జాప్యం గురించి వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తంచేయడం లేదు.
నిధులు రాక పెండింగ్‌లో..
జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 16 మండలాల నుంచి ఈ రెండు పథకాలకు వచ్చిన 6,285 దరఖాస్తులు అధికారుల వద్దే ఉన్నాయి. లాక్ డౌన్ విధించే నాటికి (2019-20) హైదరాబాద్ డివిజన్ పరిధిలో కల్యాణ లక్ష్మికి 1,687, షాదీ ముబారక్‌కు 2,785, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కల్యాణ లక్ష్మికి 1,245, షాదీ ముబారక్‌కు 568 దరఖాస్తులను ఆయా డివిజన్‌ల ఆర్డీవోలు అప్రూవ్ చేశారు. మార్చి 23 నుంచి జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉన్నాయి.ఉద్యోగులు వలస కార్మికుల తరలింపులో బిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లతో పాటు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర పనులన్నీ నిలిచిపోయాయి.
కలెక్టర్‌కు ట్వీట్..
షాదీ ముబారక్ సాయం అందకపోవడంతో హైదరాబాద్ ఆర్డీవో పరిధిలోని ఆసిఫ్‌నగర్ మండలానికి చెందిన రియాజుద్దీన్ కలెక్టర్ శ్వేతా మహాంతికి ట్వీట్ చేశారు. వివరాలను పరిశీలించిన కలెక్టర్, డబ్బులు మంజూరయ్యాయి కానీ, బ్యాంకు నుంచి ఆర్డీవోకు చెక్కు అందలేదని, రాగానే సాయం అందజేస్తారని ఆమె ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు.