వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

by srinivas |
వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లా పోలీసులు ఖాకీ డ్రెస్ వదిలి వైట్ అండ్ వైట్ డ్రెస్సులో మెరిసారు. సంప్రదాయ దుస్తులో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశానుసారం ఖాకీ దుస్తులను పక్కన పెట్టి సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు.

తెల్ల చొక్కా, పంచ, కండువా ధరించి ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగ కళ ఉట్టిపడేలా స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేయించారు. అనంతరం ఎస్పీ అన్బురాజన్​ను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా రోజుల తర్వాత తాము కూడా ప్రజలతో సంక్రాంతి పండగ చేసుకున్నామని ఖాకీలు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed