ట్రంప్‌లా చేయనని ముందుగానే హామీ ఇస్తున్నా..

by Anukaran |
ట్రంప్‌లా చేయనని ముందుగానే హామీ ఇస్తున్నా..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరోసారి మండిపడ్డారు. ఆన్ లైన్ లో జరిగిన నేషనల్ గార్డ్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్రంప్ లాగా నా వ్యక్తిగత కక్ష్య సాధింపులకు, పౌరుల హక్కులను కాలరాసేందుకు అమెరికా మిలటరీని వినియోగించబోనని ముందుగానే హామీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాల్లోకి మిలటరీని లాగబోనని తేల్చి చెప్పారు. కాగా, ఇటీవల వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న జాత్యహంకార వ్యతిరేక నిరసనలను అణిచివేసేందుకు ట్రంప్ మిలటరీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed