- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాల్ టికెట్లు విడుదల.. ఒక్కో పోస్టుకు 29 మంది పోటీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని గురుకులాల్లో 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షల(సీబీఆర్టీ)కు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో వచ్చాయి. ఆగస్టు 1 నుంచి 23 మధ్య పలు తేదీల్లో జరిగే టీజీటీ, లైబ్రేరియన్, పీడీ ఇన్ స్కూల్స్‌తో పాటు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. మిగతా పోస్టులకు సంబంధించిన హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు బోర్డు పేర్కొంది.
గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టులకు నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవడంతో ఒక్కో పోస్టుకు సగటున 29మంది చొప్పున పోటీ పడుతున్నారు. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ 868, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ 2008, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) 1276, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ). 4020, లైబ్రేరియన్ స్కూల్ 434, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ 275, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్లు 134, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులు 92 , మ్యూజిక్ టీచర్లు 124 పోస్టులు ఖాళీగా వున్నాయి.