కాల్కమ్ విజన్ లిమిటెడ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు

by Harish |
కాల్కమ్ విజన్ లిమిటెడ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: కాల్కామ్ విజన్ లిమిటెడ్‌లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

డిప్లొమా అప్రెంటిస్: 210 ఖాళీలు

విభాగాలు: మెకానికల్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈఈఈ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.

అర్హత: 2020/2021, 2021/2022, 2022/2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: రూ. 11,000 ఉంటుంది.

ఎన్ఏటీఎస్ పోర్టల్ లో వివరాలు నమోదుకు చివరి తేదీ: మార్చి 25, 2023.

వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in/

Advertisement

Next Story