'తలైవి' సోగ్గాడుగా బెంగాలీ నటుడు

by Shyam |
తలైవి సోగ్గాడుగా బెంగాలీ నటుడు
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవిలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనా. డైరెక్టర్ ఎఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కోసం కంగనా దాదాపు 10కేజీల బరువు పెరిగిందట. కానీ టీజర్‌కు మాత్రం మిక్స్‌డ్ టాక్ రావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్.

జయలలిత జీవిత కథ కాబట్టి ఎంజీఆర్, శోభన్ బాబుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కాగా ఇందులో ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తుండగా ఆయన లుక్‌కు మంచి మార్కులు పడ్డాయి. జయలలితకు అత్యంత సన్నిహితుడైన హీరో శోభన్‌బాబు పాత్రకు బెంగాలీ నటుడు జిస్సేన్ గుప్తాను ఎన్నుకుందట చిత్ర యూనిట్. మరి గుప్తా సోగ్గాడిని మరిపిస్తారో లేదో చూడాలి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జూన్ 26న రిలీజ్ కానున్న సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story