- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్-జియో స్మార్ట్‌ఫోన్ టార్గెట్ ఏంటో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో గూగుల్-జియో భాగస్వామ్యం ద్వారా కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కలిగి ఉన్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. దీనికి జియోఫోన్ తొలి అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లోని ప్రజలకు వారి మాతృభాషలో సమాచారాన్ని తీసుకురావడం, కొత్త ఉత్పత్తులు, సేవలను నిర్మించడం, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యాపారాలను శక్తివంతం చేయడంపై తాము దృష్టి సారించామని సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్, జియో సంయుక్తంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్‌ను అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని, ఇరు సంస్థల అప్లికేషన్లను అందించె విధంగా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఉంటుందని ఆయన వివరించారు. అలాగే, జియో, గూగుల్ క్లౌడ్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందించనున్నట్టు ఆయన వెల్లడించారు.