అమెజాన్ అధినేత సంచలన నిర్ణయం..

by Anukaran |
అమెజాన్ అధినేత సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్-2 స్థానంలో కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలోనే కంపెనీ CEO బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. బెజోస్ 30 ఏళ్ల నుంచి అమెజాన్ సీఈవోగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బెజోస్ తాజా నిర్ణయంతో అమెజాన్‌కు కాబోయే తరువాయి బాస్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, బెజోస్ సీఈవోగా తప్పుకునే కొద్దిరోజుల ముందు అమెజాన్ కొత్త సీఈవోను ప్రకటిస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జెఫ్ బెజోస్ 182 బిలియన్స్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతుండగా, 197బిలియన్ డాలర్ల నెట్వర్త్‌తో టెస్లా మోటర్స్ అధినేత ఎలన్ మస్క్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed