టీఆర్ఎస్ ముందుగా ఓడిపోయేది ఈ నియోజకవర్గమే.. జంగయ్య యాదవ్

by Shyam |
jangayya yadav
X

దిశ, కొందుర్గు: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే మొదటి నియోజకవర్గం షాద్‌నగర్ అని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ జంగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం, గాలిగూడెం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు రాజు నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రైతులు, ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు చివరకు మీడియాను కుడా తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో వరిసాగు చెయ్యొద్దంటూ.. ముఖ్యమంత్రి దొడ్డిదారిన తన ఫాంహౌస్లో 150 ఎకరాలలో వరి ధాన్యం పండిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసేకునేందుకు ప్రజలు, కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. సభ్యత్వం చేసే కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed