వినాయక చవితి నుంచే… మొదలెట్టండి : పవన్

by srinivas |   ( Updated:2020-08-20 11:02:23.0  )
వినాయక చవితి నుంచే… మొదలెట్టండి : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఆత్మ నిర్భర్ భారత్ ’ ఏ ఒక్క వర్గానికో కాదని, దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించినదని అని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

గణేష్ నవరాత్రి పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలన్నారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు. వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని, జనసేన-భాజపా సంయుక్తంగా నిర్ణయించాయని, ఆయన ఓ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ తరుపున విడుదల చేసింది.

Advertisement

Next Story