- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ వస్తున్నారు.. వారి మాటలను నమ్మకండి: జానారెడ్డి
దిశ, హాలియా: మరోసారి మాయమాటలతో మభ్యపెట్టేందుకు మీ ముందుకు వస్తున్నారు జాగ్రత్త.. అని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం ‘సాగర్’ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నిడమనూరు మండలం ఎర్రబెల్లి, మారుపాక, జూలకంటిగూడెం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధే తప్ప కొత్తగా వేసిన రోడ్లు, పాఠశాల భవనాలు, వంతెనలు, విద్యుత్ సౌకర్యం ఏమీ లేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఏ ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికీ కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ హామీలైతే ఇచ్చారో సాగర్ ఉప ఎన్నికల్లో కూడా అవే హామీలు ఇస్తున్నారన్నారు. కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టి, మోసం చేసే వారికి ఈ ఎన్నికలు గుణపాఠం కావాలని కోరారు. గుర్రంపోడు, కామారెడ్డి గూడెం గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా నాయకులు రంగ సాయిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య, జెడ్పీటీసీ రామేశ్వరి, వల్లభ్‌రెడ్డి, శివమారయ్య, మట్టారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.