AP News : అమ్మఒడి లబ్ధిదారులకు జగన్ సర్కార్ షాక్.. ఇక నుంచి అది తప్పనిసరి

by Anukaran |   ( Updated:2021-10-28 06:44:12.0  )
AP News : అమ్మఒడి లబ్ధిదారులకు జగన్ సర్కార్ షాక్.. ఇక నుంచి అది తప్పనిసరి
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం కండీషన్స్ అప్లై చేసింది. అమ్మ ఒడి పథకానికి ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్‌ 8,2021 నుంచి ఏప్రిల్‌ 30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరంగా ఉందని, ఇందులో ఖచ్చితంగా 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

అమ్మఒడి పథకం అమలు చేస్తున్నప్పుడే ఈ నిబంధనను అమలు చేస్తామని చెప్పామని అయితే గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో ఈ నిబంధనను అమలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇకపై ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed