- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెల 20న పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు.. కసరత్తు మొదలుపెట్టిన కేంద్రం..?
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని దానిపై క్రమంగా సస్పెన్స్ వీడుతున్నది. ఈనెల 20వ తేదీన పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు మహిళా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఐదురోజుల స్పెషల్ సెషన్ సందర్భంగా మహిళా బిల్లును 20వ తేదీన ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సమావేశాల్లో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సెషన్స్ ప్రారంభం సందర్భంగా చెప్పారు. ఈ నిర్ణయాల్లో మహిళా బిల్లు కూడా ఉంటుందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తున్నది. ఈ క్రమంలో 20వ తేదీన సభ ముందుకు ఈ బిల్లురాబోతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ బిల్లు విషయంలో కేంద్రం కసరత్తు చేస్తుందన్న సమాచారం ఆసక్తిగా మారింది.