- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాంగోవర్ పోగొట్టే ఉంగరం.. ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో లభ్యం
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ఫంక్షన్లు, పార్టీల్లో మందుకొట్టడం చాలా కామన్. అయితే మితంగా తీసుకుంటే పర్వాలేదు గానీ లిమిట్ దాటితే మాత్రం మరుసటిరోజు హ్యాంగోవర్‌తో ఉక్కరిబిక్కిరి అవ్వాల్సిందే. ఇక ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు రకరకాల రెమెడీస్ ప్రయత్నిస్తుంటారు. ఎనర్జీ డ్రింక్స్ ట్రై చేస్తుంటారు. ఇక పచ్చి కోడిగుడ్లను కూడా నివారణ మార్గాల్లో ఒకటిగా చెప్తుంటారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం వీటన్నిటి కంటే భిన్నమైన పురాతన పరిష్కారాన్ని కనుగొన్నారు. తవ్వకాల్లో బయటపడిన ఊదా రంగు రాయితో పొదగబడిన బంగారపు ఉంగరం హ్యాంగోవర్‌ను పోగొడుతుందని చెప్తున్నారు.
ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ప్రకారం.. యావ్నే నగరంలో జరిపిన తవ్వకాల్లో బైజాంటైన్ యుగానికి చెందిన అతిపెద్ద వైనరీ స్థలంలో పురాతన ఆభరణం బయటపడింది. అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించేందుకు ఈ ఉంగరాన్ని ధరించి ఉండవచ్చని పత్రికా ప్రకటనలో తెలిపిన పురాతత్వ శాస్త్రవేత్త అమీర్ గోలాని.. ఈ రత్నానికి ఇంకా చాలా సుగుణాలు జోడించబడ్డాయని తెలిపారు. భూమిపై నుంచి కేవలం 150 మీటర్ల (492 అడుగులు) దిగువన వైన్ నిల్వ చేసేందుకు ఉపయోగించే ఒక రకమైన జార్ ఆంఫోరేను కలిగి ఉన్న వేర్‌హౌస్ అవశేషాల నుంచి కనుగొనబడింది.
తవ్వకాలు జరిపిన స్థలం సుమారుగా 7వ శతాబ్ధానికి చెందినది కాగా, బైజాంటైన్ శకం ముగింపు, ఇస్లామిక్ పీరియడ్ ప్రారంభానికి చెందినదని భావిస్తున్నారు. ఇక ఈ రింగ్ మరింత పాతదై ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ఉంగరం 3వ శతాబ్ధం CE కంటే ముందుగా నగరంలో నివసించిన ప్రముఖులకు చెందినదని పత్రికా ప్రకటన వెలువడింది. 5.11 గ్రాముల (0.2 ఔన్సుల కంటే తక్కువ) బరువున్న ఈ ఉంగరం అప్పటి సంపన్న వర్గానికి చెందిన వ్యక్తిది కావచ్చని గోలాని పేర్కొన్నారు.