- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడితో హాలిడే ట్రిప్.. తెల్లారేసరికి శవంగా తేలిన స్టార్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. మరాఠీ యువ హీరోయిన్ ఈశ్వరి దేశ్ పాండే(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. మరాఠీ యువ హీరోయిన్ ఈశ్వరి దేశ్ పాండే సెప్టెంబర్ 15 న తన ప్రియుడు శుభమ్ డెడ్జ్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లింది. ఈ నేపధ్యంలోనే ఈ సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్ఫారో గ్రామానికి సమీపంలో బాగా-కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
కారు సెంట్రల్ లాక్ చేసి ఉండడంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేక లోపలే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. అతి చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో మరాఠీ చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఈశ్వరి హఠాత్ మరణం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని పలువురు సినీ ప్రముఖులు తెలిపారు. ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడంతో బంధువులు స్నేహితులు షాక్ కు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.