సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి

by Shyam |
సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
X

దిశ,మునుగోడు: నియోజకవర్గానికి సాగునీరు అందించే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటై ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా వాటిని పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. చౌటుప్పల్,నారాయణపురం మండలాల సీపీఐ పార్టీ కౌన్సిల్ సమావేశం నారాయణపురం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం వాటిని ఆలస్యం చేస్తోందని విమర్శించారు. శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిచేయడం ద్వారానే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. వెనుకబడిన మునుగోడు,దేవరకొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ సొరంగ మార్గాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story