నేపాల్ తో జరిగే కబడ్డీ పోటీలకు ఎంపికైన ఇర్ఫాన్

by Sridhar Babu |
Irphaan-12
X

దిశ, పెద్దపల్లి: ఇండో-నేపాల్ కబడ్డీ జట్టుకు ఎంపికైన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పెద్దంపేట్ కు చెందిన ఎస్కే ఇర్ఫాన్ ను శుక్రవారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్కూల్ గేమ్స్ డెవలెప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇర్ఫాన్ ఇండియా తరుపున నేపాల్ తో జరిగే కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు మేదరబోయిన కుమార్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేశి రవిందర్ లు ఆయనను శాలువాతో సత్కరించి ఇండో-నేపాల్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రో కబడ్డీకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట్ సర్పంచ్ చింతపట్ల నాగరాజు, ఎంపీటీసీ కామ శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఇర్ఫాన్ తండ్రి బాబర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story