- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IRCTC బంపర్ ఆఫర్.. వారి కోసం స్పెషల్ ప్యాకేజ్ ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం పర్యాటకంపై తీవ్రంగా పడింది. అన్ని రంగాలు పుంజుకున్నా పర్యాటకం ఇంకా నత్తనడకే నడుస్తోంది. అయితే దేశంలో పర్యాటకాన్ని మళ్లీ యథావిధికి తీసుకురావాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే పర్యాటకులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తక్కువ ధరకే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విజయవాడ, విశాఖ నుంచి గుజరాత్ వరకు ఈ ప్యాకేజీ ఉంది. ఈ ప్యాకేజీతో 11 రోజుల టూర్‌కు తీసుకెళ్తోంది.
అది కూడా కేవలం రూ.10,400కే పలు ప్రసిద్ధ ప్రదేశాలను పర్యటించే సువర్ణ అవకాశం అంటూ ప్రచారం చేస్తోంది. దీనికి వైబ్రంట్ గుజరాత్ అని నామకరణం చేసింది. ఈ టూర్‌లో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, అహ్మదాబాద్, బెట్ ద్వారక, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రాంతాలు చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ 2022 జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 31తో ముగుస్తుంది.
ఈ టూర్‌లో భాగంగా మొదటి రోజు పర్యాటకులు ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, సామర్లకోట, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, పలాసలో రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఇందులో మొదటి రెండు రోజులు ప్రయాణమే ఉంటుంది. ఆ తర్వాత నాలుగో రోజు సోమనాథ్ చేరుకుంటారు. అక్కడి నుంచి వరుసగా ప్యాకేజీలో చెప్పిన ప్రదేశాలను సందర్శించవచ్చు.
Religious #tours in #India would be incomplete without a visit to #Gujarat. From #Dwarka Dheesh to #Somnath #Temple, there's so much to see. #Book #IRCTCTourism's 'Vibrant Gujarat' 10 D/11N package from Rs.10400 pp & Details: https://t.co/7YonV415GFhttps://t.co/Wtma30c7Sc
— IRCTC (@IRCTCofficial) October 14, 2021