IPL 2024లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే నాలుగు జట్లు ఇవే..? తేల్చేసిన నిపుణుల ప్యానెల్

by Satheesh |   ( Updated:2024-05-15 10:34:53.0  )
IPL 2024లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే నాలుగు జట్లు ఇవే..? తేల్చేసిన నిపుణుల ప్యానెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో లీగ్ మ్యాచులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. మిగిలిన మరో రెండు బెర్తుల కోసం చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, లక్నో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే నాలుగు జట్లు ఏవి అనే దానిపై మాజీ క్రికెటర్స్ ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, టామ్ మూడీ, మాథ్యు హేడెన్‌లతో కూడిన స్టార్ స్పోర్ట్స్ నిపుణుల ప్యానెల్ ఓ అంచనా వేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరుకుంటాయని ఈ ప్యానెల్ అభిప్రాయపడింది.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ నెల 18న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. 18.1 ఓవర్ల టార్గెట్‌ను చేయడం లేదా.. 18 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల తేడాతో ఆర్సీబీ గెలుపొందితేనే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. దీంతో ఆర్సీబీ చెన్నైపై కచ్చితంగా విజయం సాధించి.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుందని బెంగుళూరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందో లేదో తెలియాలంటే ఈ నెల 18వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story