- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శుభమన్ గిల్‌కు భారీ షాక్ ఇచ్చిన IPL మేనేజ్మెంట్.. సెంచరీ చేసిన నో హ్యాపీ..!
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఐపీఎల్ సీజన్ ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలివాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించింది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై గుజరాత్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్, మరో యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీలతో కదం తొక్కి గుజరాత్‌ను ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిపారు. ఇదిలా ఉంటే సెంచరీతో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన కెప్టెన్ శుభమన్ గిల్‌కు ఐపీఎల్ మేనేజ్మెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా గిల్‌కు రూ.24 లక్షలు ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ సారి స్లో ఓవర్ రేటింగ్ కారణంగా గిల్‌కు రూ.12 లక్షల ఫైన్ పడగా.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి స్లో ఓవర్ రేటింగ్ నమోదు కావడంతో గిల్‌కు ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ సారి రూ.24 లక్షల పెనాల్టీ వేసింది. ఈ సీజన్‌లో మరోసారి గుజరాత్ స్లో ఓవర్ రేటింగ్ నమోదు చేస్తే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం ఉంది.