- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కీలక పోరులో రాణించిన RCB.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీతో జరుగుతోన్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్సీబీ రాణించింది. ఫ్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. తద్వారా ప్రత్యర్థి ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఢిల్లీ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పటిదార్ 52, విల్ జాక్స్ 41, కోహ్లీ 27, గ్రీన్ 32 పరుగులతో రాణించారు.
మొదటి 10 ఓవర్లలో 110 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆర్సీబీ.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో ఆర్సీబీ స్కోర్ 200 పరుగుల మార్క్‌ను దాటలేదు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ 1, ఖలీల్ అహ్మద్ 2, ముకేష్ కుమార్ 1, కుల్దీప్ 1, సలాం 2 వికెట్లు తీశారు. అనంతరం 188 పరుగులు భారీ లక్ష్యంగా ఢిల్లీ ఛేజింగ్‌కు దిగింది. ఫ్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లుకు గెలుపు అనివార్యం కావడంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. దీంతో ఏ టీమ్ విజయం సాధిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.