BREAKING: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాణించిన చెన్నై బౌలర్స్.. CSK టార్గెట్ ఎంతంటే..?

by Satheesh |   ( Updated:2024-05-12 13:53:25.0  )
BREAKING: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాణించిన చెన్నై బౌలర్స్.. CSK టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ అద్భుతంగా రాణించారు. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి రాజస్థాన్‌ను మోస్తారు స్కోర్‌కే కట్టడి చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సంజు సేన 141 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జైశ్వాల్ 24, జోస్ బట్లర్ 21, జురెల్ 28 పరుగులు చేయగా.. కెప్టెన్ సంజు శాంసన్ 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లో 141 పరుగులు మాత్రమే చేసి చెన్నైకు తక్కువ టార్గెట్‌ను విధించింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, సమర్జీత్ సింగ్ 3 వికెట్లతో చెలరేగారు. అనంతరం సీఎస్కే 142 పరుగుల మోస్తారు టార్గెట్‌తో బరిలోకి దిగింది.

Advertisement

Next Story